Our Sri Bhoo Neela Sametha Venkateswara Swamy showers Grace to any devotee who ever offers Saranagathi
తన నివాసమైన “వైకుంఠ పురం” లో తన భార్య అగు శ్రీ దేవి తో ఉన్నాడు మాహా విష్ణువు. ఎందరో ఋషులు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు లాంటి వారు తన కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతిని గమనించాడు.ఆ గజముని రక్షించడానికి బయలు దేరాడు. అదే విధంగా మన హిల్ కౌంటీ శ్రీ భూ నీల సమేత వెంకటేశ్వర స్వామి శరణాగతి అందించే ఏ భక్తుడికైనా కృపను ప్రసాదిస్తాడు
సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ. ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది.
Satyanarayana Pooja is performed for Lord Satyanarayana to removes all the obstacles and negative energies. It will help a person to get victory or success, acquire wealth and prosperity. It brings harmony to family and success in life.